కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ లో వర్గపోరు మళ్లీ బయటపడింది. రాజంపేట్ మండలం ఎల్లారెడ్డి పల్లి తండా లో ఇరువర్గాలు బాహాబాహీకి దిగి దాడి చేసుకోవటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేతలు సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు వర్గీయులు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు.